Howard Lutnick: రష్యావి వద్దు.. భారత్ మా ఆయుధాలు కొనాలి...! 1 y ago
భారత్ ఆయుధాల కోసం రష్యాపై ఆధారపడడాన్ని మానుకోవాలని యూఎస్ వాణిజ్యమంత్రి హోవార్డ్ లుట్నిక్ పేర్కొన్నారు. అప్పుడే భారత్, అమెరికా సంబంధాలు బలోపేతం అవుతాయని తెలిపారు. ప్రత్యామ్నాయంగా అధునాతన అమెరికన్ రక్షణ వ్యవస్థలను అందించడానికి తమ దేశం సిద్ధంగా ఉందని అన్నారు. యూఎస్ డాలర్‌ను భర్తీ చేయడానికి కొత్త కరెన్సీ కోసం బ్రిక్స్ యత్నిస్తే ఇరుదేశాల సంబంధాలు దెబ్బతింటాయని వెల్లడించారు.